భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి ?



 భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి ? 

పరమేశ్వరుని పూజలకు జిల్లేడూ , గన్నెరూ , మారేడూ , తమ్మి , ఉత్తరేణు ఆకులూ , జమ్మి ఆకులూ , జమ్మి పూలూ , నల్లకలువలూ మంచివి . దాసాని , మంకెన , నదంతి , మొగలి , మాలతి , కుంకుమ మద్ది ... ఈ పూలు పూజకు పనికి రావు . తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు . తమ్మి పువ్వుకు పట్టింపులేదు . మారేడు నందు శ్రీమహాలక్ష్మీ , నల్లకలువ నందు పార్వతీ , తెల్ల కలువనందు కుమార స్వామీ , కమలము నందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు . అలాగే చదువుల తల్లి సరస్వతి దేవీ తెల్ల జిల్లేడులో , బ్రహ్మ కొండవాగులో , కరవీరపుష్పంలో గణపతీ , శివమల్లిలో శ్రీమహావిష్ణువూ , సుగంధ పుష్పాల్లో గౌరీదేవీ ఉంటారు . అలాగే శ్రీమహావిష్ణువుని అక్షింతల తోనూ , మహాగణపతిని తులసితోనూ , తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవినీ , మల్లెపువ్వులతో భైరవుడ్నీ , తమ్మి పూలతో మహాలక్ష్మినీ , మొగలి పువ్వులతో శివుడ్నీ , మారేడు దళాలతో సూర్యభగవానుడ్ని ఎట్టి స్థితిలోనూ పూమీప రాదు .


Comments