అద్దం పగిలితే అరిష్టమా ?

 అద్దం పగిలితే అరిష్టమా ? 

దాని సంగతి తర్వాత పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదు . ఇంట్లో ఉంచకూడదు . మరకలు పడి లేదా మాసిపోయిన దాన్ని అసలు ఉంచకూడదు . అద్దానికీ , లక్ష్మీదేవికీ అవినాభావ సంబంధం ఉంది . అద్దం లక్ష్మి స్థానం . అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు . లక్ష్మీ అంతే . నిలకడగా ఉండదు . అద్దం పగిలితే ధన నష్టమని శాస్త్రం చెబుతోంది . గాజు వస్తువేదయినా చూసుకోండి .. పగలినప్పుడు ఎంత జాగ్రత్తగా ఏరినా , శుభ్రపరిచినా ఎక్కడోక్కడ వుండి చటుక్కున మాటు వేసిన తేలులా కాటు వేస్తుంది . కాన ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఓపికగా వెతికి ఎవ్వరూ నడవని ప్రదేశాల్లో ముక్కలని పారెయ్యాలి .



Comments