ఉత్తమ లక్షణాలనగా ఏవి ?

 

ఉత్తమ లక్షణాలనగా ఏవి ?

ఏ పలుకూ , ఏ పనీ తనకి అయిష్టమో , బాధా కరమో అట్టి వాటిని ఇతరులకు చెప్పుట చేయరాదు . కోపద్వేషాలతో ఎవ్వరినీ దూరం చేసుకోకుండా , అత్యుత్తమ సభ్యతతో ప్రవర్తిస్తూ , కనులకూ , చేతులకూ , కాళ్ళకూ గల చాపల్యతను విడిచి పెడతాడో వానియే ఉత్తమ లక్షణాలు . తనెంత గొప్ప స్థితిలోనున్నా అర్హులైన వారిని పూజించుటా , గౌరవించుట చేయువాడు ఉత్తముడు . దానంగా ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకొనక పోవటము , అట్లే ఇచ్చిన దానాన్ని నలుగురికీ తానే చెప్పుకోవటము తగదు . దాని వల్ల దాన ఫలం దక్కదు . క్షత్రియుడికి మాత్రమే ఇచ్చిన దానాన్ని చెప్పుకునే హక్కు ఉంది . మాట్లాడే ప్రతి మాట ఎదుటవారికి ప్రియంగా , హితంగా , సరళంగా ఉండాలి . సత్యాన్నే పలుకుతున్నా , వినేవారికి అసత్య మన్నట్టు తోచేలా మాట్లాడరాదు . సర్వ మాటలకి సత్యమే ప్రాణమూ , మూలమూ .



Comments