- Get link
- X
- Other Apps
ధర్మమంటే ఏమిటి ?
లోకములను ధరించేది ధర్మము . ధర్మానికి వేదమే మూలము . ధర్మము అభ్యుదయమునకూ , మానవ మనుగడకు మూలము . ధర్మమే విశ్వప్రేమను పెంచుతుంది . కృత యుగమున తపస్సు ధర్మము . త్రేతాయుగమున జ్ఞానమే ధర్మము . ద్వాపర యుగాన యజ్ఞమే ధర్మము . కలియుగాన దానమే ధర్మము . ధర్మమంటే సత్యాన్నే పలకటము . సృష్టిలోని ఏ జీవినీ బాధ పెట్టకుండా ఉండటము . ఇతరుల సంపదపై ఈర్ష్య చెందకుండా ఉండటము . ఆధ్యాత్మిక విద్యను సంపాదించటము . తెలుసు కోవటము ... ఈ నాలుగే ధర్మానికి మూలము .
- Get link
- X
- Other Apps

Comments