పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు ?

 
పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు ?


బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతాడు . గోహత్య చేసినవాడు తిరిగి మరుగుజ్జుగా జన్మిస్తాడు . స్త్రీని హత్య చేసిన వాడు నిత్య రోగిగా పుడతాడు . మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టువ్యాధితో పుట్టి బాధలు పడతాడు . శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండు రోగిగానూ , అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మూగవాడి గానూ , పుస్తకాన్ని దొంగిలించిన వాడు గ్రుడ్డివాడుగానూ , అబద్ధాలని వినే వాడు చెవిటివాడు గానూ , ఉప్పును అపహరించిన వాడు చీమగానూ , ఇష్టానుసారంగా వ్యభిచరించిన వాడు అడవిలో ఏనుగుగానూ , పిలవని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగానూ , మిత్రుడ్ని మోసం చేసినవాడు గ్రద్ధగానూ , అమ్మకాల్లో మోసం చేసిన వాడు గుడ్లగూబగానూ , భర్తనూ పలువురినీ హింసించే స్త్రీ జలగ గానూ , భర్తను మోసం చేసిన ఆడది బల్లిగానూ , గురుపత్నితో సంభోగం చేస్తే తొండగానూ , అతికామాన్ని కలిగిన వాడు గుర్రంగానూ జన్మిస్తాడు . భార్యని హింసిస్తే మేకగా పుడతాడు .


Comments