తల్లి గర్భంలోని పిండం ఎలా పెరుగుతుంది ?

 తల్లి గర్భంలోని పిండం ఎలా పెరుగుతుంది ?

అయిదు రోజులకు బుద్బుదాకారము , పదిరోజు లకు రేగిపండంత పరిమాణంగా పెరుగుతుంది . ఒక నెలకి శిరస్సు , రెండు నెలలకి భుజాలూ , మూడు నెలలకి గోళ్ళూ , రోమాలూ , చర్మమూ , గుహ్యాంగాలూ , నాలుగు నెలలకి సప్తధాతువులూ , ఐదు నెలలకి ఆకలిదప్పికలూ , ఆరు నెలలకి మాయతో కప్పపడి , ఏడవ నెలలో జ్ఞానం కలిగి అటూ ఇటూ కదులుతాడు . నెలలు నిండి జన్మించే వరకూ లోపల జీవి అనేక విధాలుగా , గత జన్మలో చేసిన పాపాలనూ , తప్పులనూ పునరాలోచించుకుని , జన్మలో అవి చెయ్యనని దేవదేవుడ్ని ప్రార్థిస్తూ భూమి మీద పడతాడు . అయితే పడీ పడగానే మాయ కమ్మేస్తుంది . అంతా మరిచి పోతాడు . మళ్ళీ మాములు పోరాటమే . ధన పోరాటము . పోరాటము . కుటుంబ పోరాటము . కీర్తి పోరాటము . వ్యసనపోరాటము . ఆకలిపోరాటము . జూదపోరాటము . ఐహికమైన సుఖాలకి పోరాటము .



Comments