కుంకుమ బొట్టు ఎందుకు ధరించాలి ?

  కుంకుమ ) బొట్టు ఎందుకు ధరించాలి ? 



మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో అధి దేవత ఉన్నాడు . అలాగే లలాట -అధిదేవత బ్రహ్మ . లలాటం బ్రహ్మ స్థానం . బ్రహ్మదేవుడి రంగు ఎరుపు . కాన బ్రహ్మస్థానమైన లలాటాన ఎరుపు రంగు బొట్టు ధరించాలి . అనగా కుంకుమ . లలాటాన సూర్యకిరణాలు తాకరాదు . మనలోని జీవి , జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయ స్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు . కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి , ప్రశాంతి చేకూరుతుంది . నడివేలుతో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది . బొటన వేలితో ధరిస్తే శక్తి వస్తుంది . చూపుడు వేలితో ధరిస్తే భక్తి ముక్తీ కలుగుతాయి . ప్లాస్టిక్ బొట్టు బిళ్ళల వంటివి ధరించటం కన్నా కుంకుమ ధరిస్తే క్రిమి సంహారకము . కాన శ్రేష్ఠమైన 'కుంకుమ ధరించండి . ఎప్పుడయితే నుదుటన కుంకుమ అద్దుతారో అప్పుడు జ్ఞానచక్రాన్ని పూజించినట్టు అవు తుంది .

Comments