గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలి ?

 గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలి ? 



గుడి ప్రశాంతతకు మారు పేరు . దేవుడ్ని దర్శించగానే మనలోని కోపమూ , అహమూ , ఆవేశమూ , స్వార్ధ చింతన కొంతసేపూ దూర మవుతాయి . వెను వెంటనే జనారణ్యం లోకి వెళితే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది . అది ఎలాగూ తప్పదు . కాబట్టి , దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంత మైన మనసుతో కూర్చుంటే , దేవాలయాల్లో చేసిన యజ్ఞ , యాగాది , పుణ్య పూజల ఫలం వల్ల మనసు మాలిన్యం కరగటం ప్రారంభిస్తుంది . అలా కొంతయినా ఆరోగ్యకరమైన , ఆహ్లాద కరమైన సమయాన్ని గడపగలుగుతాము .




For More Informaton visit Here

Comments